వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తాజాగా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తన కుమార్తెను అరెస్ట్ చేయడంతో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. పీఎస్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ చేయి చేసుకున్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని, ఎందుకు ఆమెను అరెస్ట్ చేశారని విజయమ్మ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తామని అన్నారు. కాగా షర్మిలపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైందని పోలీసులు విజయమ్మకు సూచించారు. అనంతరం బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపారు.