Saturday, July 27, 2024

ప్రశ్నపత్రం లీకేజీ నిందితుల అరెస్టు..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : పదో తరగతి వార్షిక హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో ఒక మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ఒక మైనర్ బాలుడితో పాటు మౌటం శివ గణేష్( కమలాపూర్ గ్రామం, హనుమకొండ మండలం), బూరమ్ ప్రశాంత్ (మాజీ విలేకరి, ఆరెపల్లి, హసన్పర్తి మండలం, హనుమకొండ జిల్లా) ఉన్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్ల‌డించారు. మైనర్ నిందితుడు ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి పరీక్ష రాస్తున్న‌ తన మిత్రుడికి పరీక్షలో సాయం అందించడం కోసం కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల వెనుక భాగంలోని ప్రహరీ ప్రక్కనే వున్న చెట్టు సహాయంతో ప్రహరీ గోడ ఎక్కి పాఠశాల మొదటి అంతస్తులో కిటికి ప‌క్క‌నే పరీక్ష రాస్తున్న‌ బాలుడి నుండి ఉదయం 9.45 నిమిషాలకు హిందీ పరీక్ష పత్రాన్ని తీసుకుని దానిని తన సెల్‌ఫోన్‌లో ఫొటోను తీసుకున్నాడు. అనంతరం నిందితుడు ప్రశ్నపత్రం ఫోటో ను మరో నిందితుడైన మౌటం శివ గణేషు వాటప్స్ నంబర్‌కు పోస్ట్ చేశాడు. అనంతరం రెండో నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ ఫోన్ నుంచి ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్‌కు ఫార్వడ్‌కు చేశాడు. మూడో నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్‌కు ఎస్.ఎస్.సి 2019-20 గ్రూప్ నుండి ప్రశ్న పత్రం రావడంతో ఈ ప్రశ్న పత్రాన్ని నిందితుడు ప్రశాంత్ వివిధ గ్రూపులకు ఫార్వర్డ్ చేసాడు. దీనితో సదరు ప్రశ్న పత్రం వివిధ వాట్సప్ నంబర్కు ఫార్వర్డ్ కావడం నేడు నిర్వహించిన హిందీ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టడంతో విద్యా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు సైబర్ విభాగంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితులను గుర్తించారు.
నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఏసీపీ తిరుమల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్.ఐలు చరణ్, సతీష్, హసన్పర్తి ఎస్.ఐ విజయ్ సతీష్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్ళు కిషోర్, రాజు, ఆంజనేయులును వరంగల్ సీపీ అభినందించారు.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img