మహా కుంబాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే , మేయర్
అక్షరశక్తి, వర్ధన్నపేట : టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సోమవారం ఉదయం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రసాద పునరావర్తన మహోత్సవంలో భాగంగా చివరి రోజు మహా కుంబాభిషేక కలశపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఆయనతోపాటు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ మర్నేని మధుమతి, ఆలయ చైర్మన్ మునిగాల సంపత్, ఆలయ ఈవో నాగేశ్వర్‌రావు, ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.