Monday, June 17, 2024

కాంగ్రెస్ కార్పొరేటర్‌పై భూ ఆక్రమణ కేసు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేట‌ర్లపై భూ ఆక్ర‌మ‌ణ కేసులుక‌ల‌క‌లం రేపుతున్నాయి. మొన్న‌టికిమొన్న 7వ డివిజ‌న్ బీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్ వేముల శ్రీ‌నివాస్‌పై భూ క‌బ్జా కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. తాజాగా.. కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్ర‌మ‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ పై శ‌నివారం రాత్రి మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. ఈ వ్యవహారానికి సంబంధించి భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు, రెవెన్యూ అధికారులు కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో పోలీస్ అధికారులు జక్కుల రవీందర్ పై కేసు నమోదు చేసిన‌ట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా వరంగల్ కమిషనర్ పోలీసులు కబ్జారాయుళ్లపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తుండడంతో తమ భూములను స్థలాలను భూ అక్రమణదారుల నుండి పరిరక్షించుకోవడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img