అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ ; ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ ఆవరణలో దొంగలు చేతివాటం చూపించారు. ఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. ఐనవోలు మండల కేంద్రంలో శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గండు వసంత అనే మహిళ తన కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు మహిళా మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును లాక్కొని వెళ్ళిపోగా, మహిళా స్థానిక పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమై కేసు నమోదు చేసి ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఫొటోలను గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. దుండగుల ఆచూకీ గాని, బంగారం గాని దొరికితే ఫోన్ నెంబర్ లకు 8712685030, 8712685244 సమచారం అందించాలని ఎస్సై వెంకన్న తెలిపారు.