కురవి మండలకేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం ఆవిష్కరించారు. నకిలీ నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన దివంగత సీపీఐ మండల కార్యదర్శి లియాకత్ అలీతోపాటు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన మండల కార్యదర్శి సురేందర్ కుమార్‌కు ఈసందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
అమరుల ఆశయ సాధనకు కృషి చేయాలని, వారి స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు నిర్మించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కమ్యూని స్టులకు మరణంలేదని, వారు భౌతికంగా మన నుంచి దూరమైనా వారి ఆశయాలు ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు తమ్మెర విశ్వేశ్వర్‌రావు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయ్‌సారథి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లు సుధాకర్‌రెడ్డి, నాయకులు కర్నం రాజన్న, దూదికట్ల సారయ్య, బుడమ వెంకన్న, కన్నెం వెంకన్న, నెల్లూరి నాగేశ్వర్‌రావు, పోగుల శ్రీనివాస్, తుర్క రమేశ్ తదితరులు పాల్గొన్నారు.