అక్షరశక్తి, గూడూరు : ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన గూడూరు మండలం మట్టెవాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… సోమవారం మధ్యాహ్నం వాసం వర్షిత్ కుమార్ అతని స్నేహితుడు అరెం నవదీప్ సైకిల్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాసం సారంగపాణి వెంకటలక్ష్మిల కుమారుడు వారం వర్తిత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా… అరెం నవదీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నవదీప్ ను వెంటనే స్థానికులు మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వర్శిత్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.