Tuesday, September 10, 2024

తెలుగు రాష్ట్రాల‌కు మ‌రో వందేభార‌త్ ట్రైన్‌.. ఈ రూట్లోనే వ‌చ్చే నెల ప్రారంభం

Must Read

 

తెలుగు రాష్ట్రాల‌కు త్వరలోనే మ‌రో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇటీవల సంక్రాంతి రోజున సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ట్రైన్‌ను కేటాయించేందుకు రైల్వేశాఖ సిద్ధ‌మైంది. దీనిని సికింద్రాబాద్ – తిరుపతి మధ్య తిప్పాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఆదివారం సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు మొత్తం నాలుగు మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

వాటిల్లో సికింద్రాబాద్ – విజయవాడ – నెల్లూరు – తిరుపతి మార్గంలో వందే భారత్‌ ట్రైన్ సర్వీసును నడపాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌ధాని మోడీ ఈ ట్రైన్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్రవరి 13న ప్ర‌ధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మోడీ.. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా.. సికింద్రాబాద్ – తిరుపతి తొమ్మిదో ట్రైన్‌గా నిలవనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img