తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీగా పగ్గాలు చేపట్టారు. నూతన డీజీపీకి సీపీలు, ఎస్పీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్.. ఇప్పటివరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. హైదరాబాద్ సీపీగా, అడిషనల్ డీజీపీగా వ్యవహరించారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. నక్సల్స్ ఏరియాలో పని తీరుకుగాను.. అంజనీకుమార్ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు.