Tuesday, June 18, 2024

ప్రేమోన్మాది అజహర్ కు రిమాండ్‌

Must Read

నిల‌క‌డ‌గా అనూష ఆరోగ్య ప‌రిస్థితి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది మహ్మద్‌ అజహర్‌ను శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు త‌ర‌లించారు. హన్మకొండలో శుక్రవారం ఇంట్లో ఉన్న విద్యార్థిని అనూషపై అజహర్ కత్తితో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనూష ప్ర‌స్తుతం ఎంజీఎంలోని ఆర్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం అజహర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img