- 75 గంటల్లోపే ఎంహెచ్‌నగర్ పార్క్ నిర్మించినందుకు గుర్తింపు
- స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించిన ఆరు నగరాల్లో ఓరుగల్లు
అక్షరశక్తి, హన్మకొండ : స్మార్ట్ సిటీ ఛాలెంజ్‌లో భాగంగా ఎంహెచ్ నగర్‌లో 75 గంటల్లోపు పార్క్ నిర్మించినందుకుగాను గ్రేటర్ వరంగల్‌కు అవార్డ్ దక్కినట్లు స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించింది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్మార్ట్ సిటీస్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్లేస్‌మేకింగ్ మారథాన్ పబ్లిక్ స్పేస్‌లను పునరుద్దరించి 75 గంటల్లోగా మార్చుటకు 27 సెప్టెంబర్ నుండి 3 అక్టోబర్ 2021 వరకు జనవరి నుండి మార్చి 2022 వరకు రెండు విడతలలో నిర్వహించిన పోటీలలో
దేశవ్యాప్తంగా 43 నగరాలు పాల్గొన్నాయి. ఇందులో నుంచి ఆరు నగరాలు విజేతలుగా నిలవగా, అందులో గ్రేటర్ వరంగల్ ఒకటి కావడం విశేషం. వరంగల్‌తోపాటు భువనేశ్వర్, ఇంఫాల్, కొహిమా, శ్రీనగర్ పింప్రి-చించ్వాడ్ కు అవార్డులు దక్కాయి. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా మహానగర పాలక సంస్థ పరిధి 13వ డివిజన్ స్లమ్ ఏరియా ఎంహెచ్ నగర్ ఛాలెంజ్ లో భాగంగా 75 గంటల్లో పార్కు నిర్మాణ లక్ష్యం కాగా 56 గంటల్లోనే పూర్తి చేయడంతో ఈ గుర్తింపు దక్కింది.