Monday, June 17, 2024

మే 6న వరంగల్‌కు రాహుల్ గాంధీ..

Must Read
  • 7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో భేటీ
  • రాహుల్ తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీలు ఖ‌రారు

తెలంగాణ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగర్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ సభలో ఆయ‌న పాల్గొననున్నారు. రైతు రుణమాఫీ, విత్తనాలు, వడ్ల కొనుగోలుతో పాటు అన్నదాతలకు సంబంధించిన ఇతర సమస్యలపై సభలో ప్ర‌సంగించ‌నున్నారు.

మే 7న హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. వాస్తవానికి ఈనెలలోనే రాహుల్ రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. రంజాన్ కారణంగా షెడ్యూల్లో మార్పు చేసుకున్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img