Sunday, September 8, 2024

పేదోళ్ల వైద్యానికి సర్కార్ భరోసా..

Must Read

ల‌బ్ధిదారుల‌కు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పేదోళ్ళ వైద్యానికి భరోసాగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ లక్ష్మిపురానికి చెందిన బిర్రు వజ్రమ్మ అనారోగ్యంతో బాధ‌పడుతూ నిమ్స్ లో చేరింది. వైద్య ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను కలిసి వారి సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నరేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కే టీఆర్ సహ‌కారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 5 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఈ రోజు సంబందిత లెటర్ ను శివనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందని,పేదోళ్ళకు ఆపదొస్తే తక్షణమే టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందిస్తుంద‌న్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిన సురేష్, టీఆర్ఎస్ అర్బన్ యూత్ నాయకుడు మోడెం ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకులు కొమ్ము రాజు, కొణతం మోహన్, పెంచాల కుమారస్వామి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొంది ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేసుకున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 37 మందికి మంజూరైన రూ.15,94,500 రూపాయల విలువచేసే 37 చెక్కులను శివనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అంద‌జేశారు.

ఆయ‌న వెంట కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, ఆకుతోట తేజశ్వి శిరీష్, పల్లం పద్మ రవి, వస్కుల బాబు, బాలిన సురేష్, మరుపల్లి రవి, సోమిశెట్టి ప్రవీణ్, టీఆర్ఎస్ అర్బన్ యూత్ నాయకులు మోడెం ప్రవీణ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img