అక్షరశక్తి, భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల శిరీష ఐలయ్య దంపతుల కుమారుడు మోహన్ చంద్ (20) శనివారం రాత్రి ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందడం తో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడు స్థానిక కళాశాలలో ఎం. ఎల్. టీ కోర్స్ పూర్తి చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.