Tuesday, June 25, 2024

సెప్టెంబ‌ర్ 17 విలీన‌మే..!

Must Read
  • న‌ర‌హంత‌క నైజాంకు వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టుల‌ అలుపెర‌గ‌ని పోరాటం
  • నాలుగున్న‌ర వేల‌మంది ప్రాణ‌త్యాగం చేశారు
  • ప‌దిల‌క్ష‌ల ఎక‌రాల భూమిని పంచారు
  • వేలాది గ్రామాల‌ను విముక్తి చేశారు
  • సాయుధ పోరాట నిజ‌మైన‌ వార‌సులు క‌మ్యూనిస్టులే..
  • చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌కు బీజేపీ కుట్ర‌లు
  • టీఆర్ఎస్ వాళ్లు చ‌రిత్ర ద్రోహులు
  • సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌
  • అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ

చారెడు నేల కోసం, చాకిరీ ర‌ద్దు కోసం నాజీల‌ను మించిన న‌ర‌హంత‌క నైజాంను త‌ర‌మ‌డం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించింది భార‌త క‌మ్యూనిస్టు పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం జ‌రిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు నాలుగ‌న్న‌ర వేల మందిని కో ల్పోయింది. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయ‌ణ‌రెడ్డి, మగ్దుం మొహియిద్దీన్ నాయ‌క‌త్వంలో సుమారు ప‌ది లక్ష‌ల ఎకరాల భూమిని పేద‌ల‌కు పంచి, వేలాది గ్రామాల‌ను విముక్తి చేసింది. రాచ‌రికానికి, నిరంకుశ‌త్వానికి వ్య‌తిరేకంగా జరిగిన ఇంత‌టి చారిత్ర‌క పోరాటాన్ని హిందూ, ముస్లింల మ‌ధ్య త‌గాదగా చి త్రీక‌రించేందుకు ఇవాళ మతోన్మాద బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. చరిత్ర‌ను పూర్తిగా వ‌క్రీక‌రించేందుకు కుట్ర ప‌న్నుతోంది. సాయుధ పోరాటం గురించి మాట్లాతున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అద్దె మైకుల్లాంటివి. చ‌రిత్రహీనులు బీజేపీ వాళ్ల‌యితే, చ‌రిత్రద్రోహులు టీఆర్ఎస్ వాళ్లు.. తెలంగాణ సాయుధ పోరాట నిజ‌మైన వార‌స‌త్వ హక్కు కేవ‌లం భార‌త క‌మ్యూనిస్టు పార్టీదే.. అంటున్నారు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌. సెప్టెంబ‌ర్ 17 ముమ్మాటికి విలీన దినోత్స‌వ‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ప్ర‌శ్న : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఏమాత్రం సంబంధంలేని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వి మోచన పేరుతో, తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో హడావుడి చేస్తున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?

జ‌వాబు : యావ‌త్ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజ‌మైన వార‌సులు క‌మ్యూనిస్టులే.. నిజాం నిరంకుశ‌త్వానికి, ర‌జాకార్ల దౌర్జ‌న్యానికి ఎదురు నిలిచి మ‌ద‌మెక్కిన దొ ర‌త‌నాన్ని మ‌ట్టి క‌రిపించింది క‌మ్యూనిస్టులే. ర‌జాకార్ల నాయ‌కుడు ఖాసీం ర‌జ్వీ ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజ‌ల మాన‌ప్రాణాలు దోచుకుంటున్న‌ప్పుడు కుల‌, మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌ను ఏకం చేసి, సాయుధుల్ని చేసింది.. తెలంగాణ తల్లికి విముక్తి క‌ల్పించింది భార‌త క‌మ్యూనిస్టు పార్టీ. ఈ పోరాటంలో దాదాపు నాలుగ‌న్న‌ర వేల మందిని పార్టీ కోల్పోయింది. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయ‌ణ‌రెడ్డి, ముగ్దుం మొ హియిద్దీన్ నాయ‌క‌త్వంలో సుమారు పది లక్ష‌ల ఎకరాల భూమిని పేద‌ల‌కు పంచింది. వేలాది గ్రామాల ను విముక్తి చేసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మాట్లాడే హ‌క్కు కేవ‌లం క మ్యూనిస్టుల‌కు మాత్ర‌మే ఉంద‌న‌డానికి ఇంతకు మించిన ఉద‌హ‌ర‌ణ‌లేవీ అక్క‌ర్లేదు. సెప్టెంబ‌ర్ 11 నుంచి 17 వ‌ర‌కు భార‌త క‌మ్యూనిస్టు పార్టీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నాం. నేటి త‌రానికి కమ్యూనిస్టుల త్యాగాల‌ను తెలియ‌జేస్తున్నాం.

ప్ర‌శ్న : తెలంగాణ సాయుధ పోరాట వారసులు కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా…?

జ‌వాబు : నిజాం వ్య‌తిరేక పోరాటాన్ని బీజేపీ పార్టీ విముక్తి పోరాటంగా ప్ర‌క‌టిస్తోంది. ఆ రోజు బీజేపీ పార్టీలేదు. ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన‌లేదు స‌రిక‌దా అది బ్రిటీష్ పాల‌కుల‌కు, నిజాంకు అనుకూలంగా ప‌నిచేసింది. బీజేపీ వాళ్లు సాయుధ పోరాటాన్ని హైజాక్ చే స్తుండ‌టంతో తామెక్క‌డ వెన‌కబ‌డిపోతామోనని టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు ముందుకువ‌చ్చాడు. నిజంగా కేసీఆర్‌కు చిత్త‌శుద్ధి ఉంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తించి రాష్ట్రం ఏర్పాటైన‌ప్ప‌టి నుంచే అధికారికంగా వేడుక‌లు నిర్వహించేవారు. అట్లాగే క‌మ్యూనిస్టుల‌తో పాటు తాము కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి వా ర‌సులం అని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకుంటున్నారు. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ స‌మ‌ర్థించ‌లేదు. అయితే నిజాం వ్య‌తిరేకంగా, బ్రిటీష్ వాళ్ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన మాట మాత్రం వాస్త‌వం. అంత‌వ‌ర‌కు మాత్ర‌మే మేం కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వార‌సులం తామేనని టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు చెప్పుకుంటే అది చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్ముకోవ‌డ‌మే అవుతుంది. క‌మ్యూనిస్టులు త‌ప్ప సాయుధ పోరాటం గురించి మాట్లాడుతున్న వారంతా అద్దెకు తెచ్చుకున్న మైకులే. సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని చ‌రిత్ర హీనులు బీజేపీ వాళ్లయితే, చరిత్ర ద్రోహులు టీఆర్ఎస్ వాళ్లు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సెప్టెంబ‌ర్ 17ను అధికారికంగా గుర్తించ‌లేదు. కాబ‌ట్టి ఈ పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేసినవిగానే చరిత్ర‌లో మిగిలిపోతాయి. కాబ‌ట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి వార‌సులం అని చెప్పుకునే హ‌క్కు బీ జేపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌కు లేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజ‌మైన వార‌సులు క‌మ్యూనిస్టులే.

ప్ర‌శ్న : సెప్టెంబ‌ర్ 17 తెలంగాణ‌కు విమోచ‌నమా.. విలీన‌మా… విద్రోహ‌మా..?

జ‌వాబు : సెప్టెంబ‌ర్ 17 ముమ్మాటికీ తెలంగాణ‌కు విద్రోహ దిన‌మే.. నిరంకుశ నిజాం పాల‌న‌ను కూ ల్చివేయాల‌ని నాడు క‌మ్యూనిస్టు నాయ‌కత్వం బ‌హిరంగంగా పిలుపునిచ్చింది. దీంతో నిజాం వ్యతిరేక ఉ ద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రజాకార్ల ఆగ‌డాల‌ను అంత‌మొందించింది. దొర‌ల కండ‌కావ‌రాన్ని తెగ న రికి, గ‌డీల‌ను కూల్చివేసింది. దీంతో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయిన నిజాం రాజు కేంద్ర ప్ర‌భుత్వంతో స‌యోధ్య చేసుకున్నాడు. ఆయ‌న అడిగిన అన్ని హ‌క్కుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పిం చింది. అప్ప‌టి హోంమంత్రి స‌ర్ధార్ వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ నాయ‌క‌త్వంలో నిజాం రాజును ప్ర‌భుత్వం స రెండ‌ర్ చేసింది. ఈ రకంగా సాయుధ పోరాటానికి అప్ప‌టి ప్ర‌భుత్వం ద్రోహం చేసింది.

ప్ర‌శ్న : నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేకమంది ముస్లింలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మ‌రికొంద‌రు త‌మ ప్రాణాల‌ర్పించారు. అయితే సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించే అందుకు బీజేపీ ప్రయత్నిస్తుంద‌న్న వాద‌న ఉంది. దీనిపై మీ కామెంట్..?

జ‌వాబు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది ముస్లింలు కూడా చంప‌బ‌డ్డారు. ముఖ్దూం మొహినుద్దీన్ లాంటి వాళ్లు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. దీన్ని హిందూ, ముస్లింల మ‌ధ్య త‌గాదాగా చిత్రీక‌రించేందుకు మ‌తోన్మాద బీజేపీ కుట్ర ప‌న్నుతోంది. ముస్లింల‌పై హిందువులు విజ‌యం సాధించిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తూ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజానికి నిజాంకు వ్య‌తిరేకంగా జ‌రిగిన పోరాటంలో అనేక వేల మంది ముస్లింలు అసువులుబాసారు. షోయ‌బుల్లాఖాన్‌, షేక్ బందగీ వంటి వాళ్లు పోరాటంలో పాలుపంచుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మ‌ధ్య గొడ‌వ‌గా చిత్రీక‌రించేందుకు, చ‌రిత్ర‌ను వక్రీక‌రించేందుకు బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని ప్ర‌తి ఒక్క‌రూ తిప్పికొట్టాల‌ని విజ్ఙ‌ప్తి చేస్తున్నా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img