Tuesday, June 25, 2024

13న శరభ వాహన సేవ

Must Read
  • ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి శ్రీనివాస్
  • ఆహ్వాన పత్రిక ఆవిష్కర‌ణ‌
  • అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ :
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : భద్రకాళీ, భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 13న నిర్వ‌హించ‌నున్న ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు పెరిక కులబాంధువులంతా హాజ‌రుకావాల‌ని ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
    ఈ మేర‌కు మంగళవారం బాలసముద్రంలోని గురుకుల్ ధ స్కూల్‌లో అతిథులు, కుల‌సంఘం నాయ‌కుల‌తో క‌లిసి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంత‌రం సోమిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెరిక కులస్తుల యోగక్షేమాలను కోరుతూ పెరిక కుల సంఘం, పెప్సీ, ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల పరపతి సంఘాల ఆధ్వ‌ర్యంలో శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శరభ వాహన సేవ, గణపతి పూజ‌, కుంకుమార్చన, అభిషేకం మొదలగు కార్యక్రమాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. పెరిక కుల సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించనున్న ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్‌, ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్సీ బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భ‌ద్ర‌య్య‌, పెప్సీ జాతీయ అధ్య‌క్షుడు సంగ‌ని మ‌ల్లేశ్వ‌ర్‌, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి, కుడా చైర్మ‌న్ సుంద‌ర్‌రాజ్‌యాద‌వ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతార‌న్నారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అల్లం రాజేశ్ వర్మ ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం ఉంటుంద‌ని తెలిపారు. పెరిక కులస్తులంతా పెద్ద సంఖ్య‌లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ల ఈశ్వర్ కుమార్, బిళ్ళ సుదర్శన్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, మాజీ జెడ్పీటీసీ, ములుగు జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు ఆకా రాధాకృష్ణ, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రాములు, అల్లం రాజేశ్ వర్మ, హనుమకొండ పెరిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బోళ్ల వీరప్రతాప్, పెరిక ( పురగిరి క్షత్రియ) సంక్షేమ సంఘం శివనగర్ ప్రధాన కార్యదర్శి బేర శంకర్, పెరిక కుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ వడ్డె రవీందర్, శ్రీరాం వీరయ్య, సంగని జగదీశ్వర్, రామన్ స్కూల్ అధినేత తీర్థాల పురుషోత్తం, అచ్చ వినోద్ కుమార్, బెడద వెంకన్న, సంగని నాగార్జున,పెరికధాత్రి సంపాదకులు బరుపటి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img