2020లోనే పోలీసులకు శ్రద్ధ ఫిర్యాదు
ఢిల్లీ : శ్రద్ధా మర్డర్ కేసులో కీలక విషయం వెలుగుచూసింది. అఫ్తాబ్ తనను చంపి ముక్కలుముక్కలుగా నరికిపారేస్తాడంటూ.. 2020 నవంబర్ 23న శ్రద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను తీవ్రంగా కొడుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. శ్రద్ధ ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అఫ్తాబ్‌కు మరో నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీని పొడిగించింది కోర్టు. మరోవైపు శ్రద్ధా మర్డర్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఢిల్లీ పోలీసుల విచారణను అనుమానించాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా శ్రద్దాపై ఆకస్మాత్తుగా కోపం రావడంతో క్షణికావేశంలో ఆమెను హత్య చేసినట్టు కోర్టులో జడ్జి ముందు వెల్లడించాడు అఫ్తాబ్. మొహ్రాలి అడవుల్లో శ్రద్దా హత్యకు ఉపయోగించిన బ్లేడును , రంపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అఫ్తాబ్ ఫ్లాట్‌లో ఢిల్లీ పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. బాత్‌రూమ్‌లో టైల్స్‌పై రక్తం మరకలను గుర్తించారు . ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీ నుంచి చాలా సామాన్లను అఫ్తాబ్ ముంబైకి షిష్ట్ చేసినట్టు గుర్తించారు.
Must Read