అక్షరశక్తి, హన్మకొండ క్రైం : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వేలు, లక్షల్లో డబ్బులు తీసుకున్న భీమారానికి చెందిన బొక్క ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది దగ్గర డబ్బులు దండుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.