అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లో భారత నాస్తిక సమాజం నాయకుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్‌లో ప్రొటెక్షన్‌తో వెళ్తున్న నరేష్‌ని కిందకు లాగి దేహశుద్ధి చేశారు. గతంలో అ య్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్ ఇటీవలే జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే దాడి జరగడం గమనార్హం.