Saturday, July 27, 2024

అదిరిన అవేక‌న్ ..

Must Read
  • మ‌త్తు ప‌దార్థాల‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న‌
  • హాజ‌రైన మంత్రి ఎర్ర‌బెల్లి
  • సంద‌డి చేసిన పోలీస్ అధికారులు
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. కేఎంసీ మైదానంలో వాకెన్ వాక్ పేరిట సోమవారం సాయంత్రం నిర్వహించిన ” కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. మంత్రి దయాక‌ర్ రావు, సీపీ తరుణ్ జోషి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని సందడి చేస్తూనే యువతకు అవగాహన కల్పించారు.   ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజ‌రై మాట్లాడుతూ విద్యార్థి, యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా ఉన్నతాశయంతో ఎదగాలని. పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో కాకతీయ వైద్య కళాశాల మైదానంలో డ్రగ్స్, రోడ్డు భద్రతపై నయీ కిరణ్, వాకెన్ వాక్ నినాదంతో కార్యక్రమం చేశారన్నారు. మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి జిల్లా ప్రధా న న్యాయమూర్తి నందికొండ నర్సింగారావు, సీపీ తరుణ్ జోషి, నిట్ డైరెక్టర్ ఆచార్య రమ ణారావు, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాస్‌ మాట్లా డుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే జరిగే నష్టాలను వివరించారు. విద్యార్థులతో సీపీ ‘నో టు ది డ్రగ్స్’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు.  మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవిత ఆశ యాలను కోల్పోయిన జాతీయ క్రీడాకారు లతో కలిసి మత్తు పదార్థా లతో జరిగే నష్టా లను వివరించే నో టు ది డ్రగ్స్ నినాదా లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.        డిజైనర్ రాం అగర్వాల్ రూపొందించిన విభిన్న దుస్తుల్లో మోడల్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో వావ్ అనిపించిది. అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ కళాకారుడు వేణు గోపాల్ ఇసుకతో ఓరుగల్లు కోట. పర్యాటక ప్రాంతాలు, భద్రకాళీ ఆలయం, నిట్, కేఎంసీలను వేసి అబ్బురపరి చారు. ఫ్రూట్ నాగరాజు పాటలకు మరచిపోయారు. ఈ కార్యక్రమ చివరలో మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నయూ కిరణ్ సెంటర్ అందించిన చిక్సిత, కౌన్సిలింగ్ తిరిగి సాధరణ స్థితి చెరుకున్న యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేసారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీహన్మంతు, గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీపీ వెంకటలక్ష్మి, అశోక్ కుమార్, సీతారాం, అదనపు డీసీపీ పుష్పా, వైభవ్ గైక్వాడ్ తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, బన్ను సేవా సంస్థ ప్రతినిధులు, విధ్యార్థులు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img