టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి ప్రకటించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటికే టైన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేయడంతో పరీక్షకు అర్హత సాధించి, మెయిన్స్‌కు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం అయోమయంలో పడింది. గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన కారణంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాధారాలు రుజువైన కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.