అక్షరశక్తి, హైదరాబాద్: భారత నాస్తిక సమాజం సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న భైరి నరేష్‌ను సంఘం నుంచి తొలగించినామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న బైరి నరేష్ సంఘానికి , కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండా తన వ్యక్తిగత ఆలోచనతో సొంత నిర్ణయాలతో పనిచేస్తూ ఆర్థిక ఉల్లంఘనలు చేసినందుకు, ఈమధ్య కాలంలో అయ్యప్ప జననంపైన అనుచిత వాక్యలు చేసినందుకు, వివిధ న్యూస్ ఛానళ్లలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అనేక ఇతర క్రమశిక్షణ ఉల్లంఘనల కారణంగా భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవి నుండి తొలగించిందని తెలిపారు. సంఘం కార్యకర్తలను నాయకులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన గ్యార శ్రీనును రాష్ట్ర కమిటీ నుంచి తొలగించడంతోపాటు, బైరి నరేష్ చేసిన క్రమశిక్షణల ఉల్లంఘన పైన పూర్తి విచారణ చేయడానికి ఒక కమిటి వేశామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు బైరి నరేష్ భారత నాస్తిక సమాజం కార్యక్రమాలకు దూరంగా వుండాలని నిర్ణయించామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వెంట రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్రె మల్లేశం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొల్లి ఆదం రాజ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ రషీద్ తదితరులు ఉన్నారు.