Saturday, July 27, 2024

యాదాద్రిలో ఘ‌నంగా శతాధిక మహిళా కవితోత్సవం

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, యాదాద్రి : కలంస్నేహం సంగీత, సాహిత్య సామాజిక సేవా సంస్థ అధిపతి, సంగీత దర్శకుడు గోపాల్ ఆచార్య ఆధ్వ‌ర్యంలో శతాధిక మహిళా కవితోత్సవాన్ని 108 మంది మహిళా కవయిత్రులతో యాదాద్రిలో ఘ‌నంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుండి విచ్చేసిన ప్రముఖ కవయిత్రులతో స్థానిక మున్నూరు కాపు భవన్ కళకళలాడింది. ఈసంద‌ర్భంగా సంస్థ వ్యవస్థాపకులు గోపాల్ ఆచార్య మాట్లాడుతూ… స్త్రీలు అబలలు కారని, వారిలోని అంతర్లీనంగా దాగి ఉన్న శక్తులకు చేయూతనివ్వడమే సంస్థ లక్ష్యం అన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల‌ని, ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ ముంద‌డుగు వేసేందుకు సంస్థ కృషి చేస్తుంద‌న్నారు. మహిళా శక్తి జగత్తుకే ప్రాణాధారమని తెలియజేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం విశిష్ట‌త‌ను, యాదాద్రి లక్ష్మీనరసింహ క్షేత్రం మహిమను సంస్థ గౌరవ అధ్యక్షురాలు, లయన్ అరుణ కుమారి తెలియ జేశారు. కలంస్నేహం సంస్థ ద్వారా చేప‌డుతున్న సాహిత్య కృషిని జాతీయప్రధాన కార్యదర్శి రాధా కుసుమ తెలియ‌జేశారు. సాహిత్య కృషితోపాటు, అవసరమైన వారికి చేయూతని అందిస్తూ సామాజిక సేవా పరంగా కూడా కృషి చేస్తున్నామని కోశాధికారి హరి రమణ తెలియజేశారు. సమావేశానికి ఆత్మీయ అతిథులుగా ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యులు శ్రీడాక్టర్ సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది వనజ హాజ‌రై మాట్లాడుతూ.. మానవ జీవితాన్ని ఉన్నతంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దే భక్తి భావనలు, క్రమశిక్షణతో కూడిన మన ఆచార వ్యవహారాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. ఈసంద‌ర్భంగా గోపాల్ ఆచార్య సేవలను కొనియాడారు. అనంత‌రం కవయిత్రులు శిల్పారాణి, కొత్త ప్రియాంక, రాధా ఓడూరి, యశోదను ఘనంగా శాలువా, ప్రశంసా పత్రం, జ్ఞాపికలతో సత్కరించారు. కార్య‌క్ర‌మంలో జాతీయ సమూహ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ ఆచార్య, జాతీయ ప్రధాన గౌరవాధ్యక్షు రాలు లయన్ అరుణ కుమారి, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధా కుసుమ, జాతీయ ప్రధాన కోశాధి కారి సీహెచ్ హరి రమణ, కలం స్నేహం ప్రధాన అడ్మిన్ గీతాశ్రీ స్వర్గం, స్వర స్నేహం ప్రధాన అడ్మిన్ మా ధురి భూషణ్, కథా స్నేహం ప్రధాన అడ్మిన్ కానుగు రాధిక, నాట్య స్నేహం ప్రధాన అడ్మిన్ సరళా కొండన్, చిత్ర స్నేహం ప్రధాన అడ్మిన్ సుధా మండవ, సావిత్రి రవిదేశాయ్, హన్మ కొండ జిల్లా అధ్యక్షురాలు మేరుగు అనురాధ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img