అక్షరశక్తి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో వివేక్ ఆయన కుమారుడు వంశీ పార్టీ కండువా కప్పుకున్నారు. గత కొన్ని రోజులుగా వివేక్ బీజేపీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీ మార్పుపై మీడియా ప్రశ్నించగా తప్పుడు సమాచారంగా వివేక్ కొట్టిపారేశారు. ఈక్రమంలోనే హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డితో మంగళవారంరాత్రి రహస్యంగా సమావేశమైన వివేక్ ఇవాళ బీజేపీకి రాజీనామా చేయడం పార్టీలో కలకలంరేపింది.
కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలం
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చేరికతో కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబంతో .. వివేక్ కు మూడు తరాల అనుబంధం ఉందని, సొంత కుటుంబంలోకి వివేక్ వచ్చారని అన్నారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి నినాదంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంకటస్వామి
Must Read