టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండునూరేళ్లు జీవించాలని ట్వీట్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా పినరయి విజయ్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.