Saturday, July 27, 2024

అస్సాం సీఎం దేశద్రోహి

Must Read
  • హిమంత బిశ్వ శ‌ర్మ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలి
  • జ‌న‌గామ‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
  • జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్
  • విడుదల చేయాలని డీసీపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల బైఠాయింపు

అక్ష‌ర‌శ‌క్తి, జనగామ, ఫిబ్రవరి 16 : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అనైతిక వ్యాఖ్య‌లు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ‌ శర్మ దేశ‌ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ జ‌న‌గామ జిల్లా అధ్య‌క్షుడు జంగా రాఘ‌వ‌రెడ్డి అన్నారు. వెంట‌నే అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరిన బైక్ ర్యాలీని చౌరస్తాలో జనగామ పోలీసులు అడ్డుకుని జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. రాఘవ రెడ్డి ని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున డీసీపీ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన డీజీపీ అరెస్టు చేసిన జంగా రాఘవ రెడ్డిని విడుదల చేశారు. ఫిర్యాదును తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అస్సాం సీఎంపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని అందించారు.

ఈ సందర్భంగా జనగామ జిల్లా అధ్యక్షులు రాఘ‌వ‌రెడ్డి మాట్లాడుతూ.. అస్సాం సీఎం దేశద్రోహి అని మండిప‌డ్డారు. పవిత్రమైన గాంధీ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని అస్సాం సీఎం విమర్శించడం దేశ ద్రోహమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమే కాకుండా అతన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు ఆగవని హెచ్చరించారు. భారతదేశంలో మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు అస్సాం సీఎంను దేశం నుండి తరిమికొట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎర్రమళ్ల సుధాకర్, డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, టౌన్ పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుకు శివరాజ్ యాదవ్, జిల్లా అధ్యక్షులు ఎన్ఎస్‌యూఐ అభి గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ రామ్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు జమాల్ షరీఫ్, బిసి సెల్ స్టేట్ కోఆర్డినేటర్ చింతకింది మల్లేశం, జనగామ మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డమీది సురేష్, దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్, కొడకండ్ల మండల పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడల సిద్దయ్య, పీఏసీఎస్ డైరక్టర్ బుచ్చిరెడ్డి, సర్వేల నర్సింగరావు, చారబుడ్ల దయాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img