అక్షరశక్తి హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నేడు శాసనసభలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైనా గత ప్రభుత్వం ఏనాడు నిరుద్యోగులకు పక్షాన నిలువలేదని అన్నరు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 30 వేల ఉద్యోగ నియామకాలు, సకాలంలో డీఎస్సీ నిర్వహణ, గ్రూప్ 2 వాయిదా, జాబ్ క్యాలెండర్ వంటి నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్ధి నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నారని అన్నరు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్, అభిరామ్ రమేష్, రమేష్ చంద్ర, సురేష్, రాజశేఖర్, అశోక్, పుష్పలీల, మొగిలి, రమ, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.