Friday, September 13, 2024

రైతుల‌ను ఆదుకుంటాం

Must Read
  • కౌలు రైతుల‌ను కూడా అండ‌గా ఉంటాం
  • పంట‌లు న‌ష్ట‌పోయామ‌ని అధైర్యప‌డొద్దు
  • ఎకరానికి రూ.10వేలు అందజేస్తాం
  • ముఖ్య‌మంత్రి కేసీఆర్‌
  • అకాల‌వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. గురువారం ఖ‌మ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలంలోని రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో, వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం దుగ్గొండి మండ‌లం అడ‌విరంగాపురంలో కేసీఆర్ ప‌ర్య‌టించి, నష్టపోయిన పంటలను ప‌రిశీలించారు. రైతుల‌తో నేరుగా మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. ఎకరానికి 10వేలు ప్రకటిస్తున్నా. వెంటనే వీటిని అందజేస్తాం. స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. ఈ డబ్బును నేరుగా రైతులకు ఇవ్వకుండా.. ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకునేలా ఆదేశాలిస్తాం. పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాం… అని సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా.. భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దు… అంటూ భ‌రోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డోర్న‌క‌ల్‌ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషన్ కలెక్టర్, వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రావీణ్య‌, సంబంధిత శాఖల అధికారులు, రైతులు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img