అక్షరశక్తి, హన్మకొండ : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకుల బృందం జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్యాల రవీందర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు పెద్ది మహేందర్ రెడ్డి, పెద్ది కిషన్ రెడ్డి, గట్టు రాజమౌళి, మనికంటి రవీందర్ రెడ్డి, ముస్కే వెంకటేశ్వర్లు, మనికంటి సమ్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.