Tuesday, June 18, 2024

కరోనా ఫోర్త్ వేవ్‌కు ఇదే సంకేత‌మా..?

Must Read

రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల్ని మ‌ళ్లీ మ‌హ‌మ్మారి భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ (ఆర్-వాల్యూ) వైద్య నిపుణులను భయపెడుతోంది. మూడు నెలల్లో ఆర్ వాల్యూ 1 దాటడమే ఇందుకు కార‌ణం. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు. ఈ ఫ్యాక్టర్ 1 లోపుంటేనే వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు లెక్క. అదే ఫ్యాక్టర్ 1 దాటిందంటే మాత్రం వ్యాప్తి పెరిగిపోతున్నట్లే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్యాక్టర్ 1 దాటిందంటే ఇక ప్రమాద ఘంటికలు మొదలైనట్లే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏప్రిల్ మొదటివారంలో 0.93 గా ఉన్న ఈ వాల్యూ మూడో వారానికి 1.07 దాటినట్లు చెన్నైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ప్రకటించింది. దీంతోనే నాలుగో వేవ్ రాబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వాల్యూ 1 దాటడానికి ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో పాటు హర్యానా ఉత్తరప్రదేశ్ కర్నాటకలో పెరుగుతున్న కేసులు కూడా కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ, యూపీలో ప్రస్తుతం ఆర్ వాల్యూ 2గా నమోదైతే ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై బెంగుళూలో 1 దాటింది. మరికొన్ని నగరాల నుండి ఇంకా అవసరమైన సమాచారం రాలేదు. మొత్తంగా ఫోర్త్ వేవ్ మొదలైతే ఎంత ఉదృతంగా ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img