Friday, September 13, 2024

తెలంగాణ‌లో ర‌ద్ద‌యిన ప‌రీక్ష‌లివే..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ తర్వాత.. ఒక్కొక్కటిగా బండారం బయటపడుతుంది. చాలా పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో వెలుగు చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు రద్దు చేస్తూనే.. మ‌రికొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏయే పరీక్షలు రద్దు అయ్యాయి.. ఏ పరీక్షలు వాయిదా పడ్డాయి అనేది వివరంగా తెలుసుకుందాం..

జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వాయిదా :
1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జూన్ లేదా జులైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. అయితే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ ని వాయిదా వేశారు.

ఏఈ పరీక్షలకు 833 అభ్యర్థులు:
833 ఏఈ పోస్టులకు 50వేల మంది అప్లై చేస్తుకున్నారు. మార్చి 5, 2023 న జరిగిన ఈ పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానంతో ఏఈ పరీక్షను రద్దు చేశారు.

టౌన్ ప్లానింగ్ అప్లికెంట్లకు నిరాశ :
టౌన్ ప్లానింగ్ అప్లికేంట్లకు నిరాశే మిగిలింది. ఈ పరీక్షల కోసం అక్టోబర్ 13, 2022 దరకాస్తు మొదలయింది. 175 పోస్టుల భర్తీకి 55,000 మంది అప్లై చేశారు. అయితే ఈ ఎగ్జామ్ డేట్ ప్రకటించే లోపే పేపర్ లీక్ అయి, టౌన్ ప్లానింగ్ పరీక్షను రద్దు చేశారు.

ఎంవీఐ పరీక్షలు క్యాన్సిల్ :
ఎంవీఐ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ జనవరి 12 న వచ్చింది. ఈ జాబ్ లో 113 వేకెన్సీలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వల్ల ఈ పరీక్షను కూడా రద్దు చేశారు.

ఏఈఈ పరీక్ష రద్దు:
జనవరి 1,2023 న జరిగిన ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పరీక్ష జరగింది. 1540 పోస్టుల భర్తీకి 81,548 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

డీఏఓ పరీక్షలకు లక్షమంది అభ్యర్థులు:
డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 53 పోస్టుల భర్తీకి 1,06,253 మంది అభ్యర్థులు దరకాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 26,2023న జరిగింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img