Tuesday, June 18, 2024

అంత‌ర్రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్ట్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఇటీవ‌ల వ‌రుస దొంగ‌త‌నాలకు పాల్ప‌డుతున్న అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠాను వ‌రంగ‌ల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలకు పా ల్పడ్డారు. ఈక్ర‌మంలోనే వ‌రంగ‌ల్‌లో బుధ‌వారం చోరీకి య‌త్నిస్తూ నలుగురు దొంగ‌లు పోలీసుల‌కు ప ట్టుబ‌డ్డారు. వీరంతా ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్, మీరట్ జిల్లాలకు చెందినవారుగా గుర్తించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బును సులభంగా సంపాదించాలనే ఆలోచనతో నిందితులు ముఠాగా ఏర్పడి చోరీల‌కు పాల్ప‌డుతున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఆపార్ట్మెంట్లు, తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీల‌కు పాల్ప‌డుతూ పలుమార్లు పోలీసులకు సైతం చిక్కి జైలు జీ వితం గడిపారు. నిందితులు చోరీ చేసిన బంగారు అభరణాలు, గంజాయితో ఢిల్లీ వెళ్ళే క్రమంలో సుబేదారి పొలీసులకు చిక్కారు. ఈ అంతర్ రాష్ట్ర ముఠా ఇప్పటి వరకు మొత్తం 16 చోరీలకు పాల్పడిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పది చోరీలకు పాల్పడగా, గతంలోను ఈ ముఠా 30 చోరీలకు పా ల్పడిన‌ట్లు పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img