అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏసీపీగా దురిశెట్టి రఘుచందర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సురేశ్ బదిలీపై వెళ్లారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏసీపీగా విధులు నిర్వహించిన రఘుచందర్ బదిలీల్లో భాగంగా జగిత్యాలకు వెళ్లారు. అనతి కాలంలోనే వర్ధన్నపేటలో పోస్టింగ్ తీ సుకున్నారు. బుధవారం విధుల్లో చేరగా పోలీస్ సిబ్బందితోపాటు పలువురు మర్యాదపూర్వకంగా కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, విధి నిర్వహణలో డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న ర ఘుచందర్ తాను పనిచేసిన చోటల్లా ప్రజల మన్ననలు పొందారు.