Tuesday, June 18, 2024

జూట్‌బ్యాగ్‌లో మంత్రి మ‌ల్లారెడ్డి ఫోన్‌..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కాలేజీలు, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎట్ట‌కేల‌కు మంత్రి మ‌ల్లారెడ్డి సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్క క్వార్టర్స్‌లో జూట్ బ్యాగ్‌లో సిబ్బంది దాచి పెట్టిన సెల్‌ఫోన్‌ను క‌నిపెట్టారు. అలాగే, మంత్రి సమీప బంధువు ఇంట్లో అధికారులు నగదును సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి నివాసంలో ఉదయం నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌ల బ్యాంకు లావాదేవీలను ఐటీ పరిశీలిస్తోంది. మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img