Saturday, July 27, 2024

వంటపని కోసం వచ్చి ఏం చేశాడో తెలుసా..?

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వంట పని కోసం వచ్చి చోరీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడి నుండి పోలీసులు రెండు లక్షల యాభైవేల రూపాయల విలువైన ద్విచక్ర వాహనం, ఒక ల్యాప్ టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్‌ తరుణ్ జోషి వివరాలను వెల్ల‌డించారు. నిందితుడు షేక్ ఫయాజ్ (23), గాజీపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వాడు. జీవనోపాధి కోసం హైదరబాద్‌కు వచ్చి నివాసం వుంటున్నాడు. హనుమకొండకు చెందిన హోటల్ నిర్వహకుడికి నిందితుడు వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయమ‌య్యాడు. తాను నిర్వహిస్తున్న హోటల్ వంటమనిషిగా పనిచేయాల్సిందిగా హోటల్ యజమాని నిందితుడుకి సూచించడంతో నిందితుడు గత అక్టోబర్ 23వ తేదీన హనుమకొండకు చేరుకున్నాడు. హోటల్ యజమాని సూచన మేరకు హనుమకొండ‌ బస్టాండ్ సమీపంలోని యజమాని కిరాయిలో గది ఉన్నాడు. అదే గదిలో హోటల్లో పనిచేసే మరో ఇద్దరు వున్నారు. వీరి వద్ద ఒక ఖరీదైన ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్ టాప్ వుండదాన్ని నిందితుడు గమనించాడు. నిందితుడు అదే రోజు రాత్రి నిందితుడు హోటల్ యజమాని కిరాయి గదిలో మిగిత వ్యక్తలతో కల్సి క్రికెట్ మ్యాచ్ వీక్షించి అనంతరం గదిలో మిగితా ఇద్దరు వ్యక్తులు నిద్రపోవడంతో ద్విచక్ర వాహనంతో పాటు ల్యాప్ టాప్ చోరీ త‌ప్పించుకుపోయాడు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు మంగ‌ళ‌వారం ఉదయం హనుమకొండ ప్రాంతంలో చోరీ చేసిన ల్యాప్ టాపు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, క్రైమ్స్ ఏసీపీ డేవిడ్‌రాజు, సీసీఎస్ ఇన్‌స్పెక్ట‌ర్లు రమేష్‌కుమార్‌, శ్రీనివాస్ రావు, హనుమ కొండ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీనివాస్ జీ, ఏఏవో సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్ఐలు సంపత్ కుమార్, బాపురావు, ఏఎస్ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, వేణుగోపాల్, షర్పూద్దీన్, కానిస్టేబుల్ నజీరుద్దీన్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img