ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ఆందోళనకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45లో గల గీతా ఆర్ట్స్ ఎదుట అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించారు. మహిళా పోలీసులు దుస్తులు వేయించి సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు సునీత వెల్లడించింది. కాగా గతంలోనూ సునీత గీతా ఆర్ట్స్ ఎదుట పలుమార్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.