Tuesday, June 18, 2024

జూట్ బ్యాగుల త‌యారీతో స్వ‌యం ఉపాధి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, దామెర : జూట్ బ్యాగుల తయారిలో మెళకువలు నేర్చుకోవాలని జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఎండి.ఖాజా మసియొద్దిన్ అన్నారు. హ‌న్మ‌కొండ జిల్లా దామెర‌ మండల కేంద్రంలో సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు జూట్ బ్యాగుల తయారీ, కుట్టు మిషన్‌ శిక్షణ నిర్వహించారు. గురువారం ముగింపు సమావేశం నిర్వహిచారు. కార్యక్రమంలో భాగంగా మహిళలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం వారి అనుభవాలను, శిక్షణపై అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా రాణించాలని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి సాధనకు జే ఎస్ ఎస్ సంస్థ అండగా ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని వ్యాపార రంగంలో ముందడుగు వేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫిర్ తిరుపతి, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫిసర్ రాజు, సుర్జిత్, రిసోర్స్ పర్సన్స్ దామెరుప్పుల సంధ్య, హింగే సువత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img