Saturday, July 27, 2024

జంజిరాల పున్నమి వేడుకలు

Must Read
  •  జంజిరాలు వేసుకొని రాఖీలు కట్టుకున్న పద్మశాలి కులస్తులు
  •  పద్మశాలి సంఘ భవనంలో హోమం
  •  ఆలయాల్లో ప్రత్యేక పూజలు
    అక్ష‌ర‌శ‌క్తి, క‌మ‌లాపూర్ : హ‌న్మ‌కొండ జిల్లా కమలాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం రాఖీ పర్వదినం పురస్కరించుకొని పద్మశాలి కులస్తులు జంజీరాల పున్నమి, రాఖీ పర్వదిన వేడుకలను కనుల పండుగగా నిర్వహించుకున్నారు. వేడుకలను పురస్కరించుకొని స్థానిక పద్మశాలి కుల సంఘ భవనంలో ప్రత్యేక హోమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. అనంతరం జంజీరాలు ధరించిన పద్మశాలి కులస్తులు రాఖీలు కట్టుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే స్థానిక విశ్వపతి ఆలయం, సువర్చల సహిత హనుమాన్ ఆలయం, సీతారామచంద్రస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుళ్లను మనసారా వేడుకొని జై మార్కండేయ నినాదాలతో నినదించారు.
  • ఈ కార్యక్రమంలో పద్మశాలి పట్టణ కమిటీ అధ్యక్షులు బైరి దశరథం, ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్, ఉపాధ్యక్షులు దాసి శంకరయ్య, చేరాల సారంగం, అభివృద్ధి కమిటీ సభ్యులు మెండు రమేష్, మార్గం బిక్షపతి, సభ్యులు వావిలాల మురళి, నాసని రాజు, వెల్ది రాము, పులికంటి ప్రభాకర్, పద్మశాలి కులబాంధవులు గాజుల సతీష్ ,కనుకుట్ల ఆంజనేయులు, చేరాల నరసయ్య, బైరి సహదేవ్, పేరాల నరసింహస్వామి, శేఖరయ్య, మెండు శ్రీనివాస్, చేరాల రమేష్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img