Saturday, September 7, 2024

*కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు*

Must Read

నాగరాజు గౌడ్ -రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు తెలంగాణ ఆల్ యూనివర్సిటీ ఇంచార్జ్

అక్షరశక్తి, హన్మకొండ: నాగరాజు మాట్లాడుతూ ఇటీవల కేయూలో Ph.D కేటగిరి 2 కి సంబంధించి నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు జరిగాయి అని మండిపడ్డారు… ప్రతి డిపార్ట్మెంట్లో 70% నుండి 80% వరకు రెగ్యులర్ విద్యార్థులకు కాకుండా పార్ట్ టైం వారికి పిహెచ్డి ఇవ్వడం జరిగింది అన్నారు..
డిగ్రీ లెక్చరర్లకు, యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం, కాంట్రాక్టు లెక్చరర్లకు.. బయట డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకులకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి తెలుస్తుందేందంటే రెగ్యులర్ విద్యార్థులను కాదని పార్ట్ టైం అడ్మిషన్లు ఇచ్చారంటే డబ్బులు చేతులు మారాయని అర్థమవుతుంది…యూజీసీ నిబంధనలకు తూట్లు పొడిచి, యూనివర్సిటీ రూపొందించిన గైడ్లైన్స్ ని తుంగలోదొక్కి ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కో విధంగా ఇంటర్వ్యూ ప్యానల్ ని మార్చి వీటిలో VC తనకు అనుకూల మైన వ్యక్తులను పెట్టుకొని తనకు సంబంధించిన వారికి సీట్లు ఇచ్చుకోవడం జరిగింది.. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు EWS రిజర్వేషన్ ఊసే లేదు కానీ కోర్టు తీర్పు పేరుతో ఉన్న కొద్ది సీట్లలో EWS రిజర్వేషన్ పెట్టి BC ,SC,ST విద్యార్థులకూ ఓపెన్ లలో దక్కాల్సిన సీట్లను కొంతమంది రెడ్డి ప్రొఫెసర్లు, రెడ్డి డీన్ లా సహకారంతో అగ్రవర్ణ విద్యార్థులకు సీట్లు అమ్ముకోవడం జరిగింది. EWS రిజర్వేషన్ కు మేము వ్యతిరేకం కాదు ఒకవేళ దీనిలో ఎలాంటి ఉద్దేశం లేకపోతే నోటిఫికేషన్లో EWS రిజర్వేషన్ల ప్రస్తావన లేదని యూనివర్సిటీ యజమాన్యం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..అంటే ఇది కుట్రలో భాగమే కదా.. ఒకవేళ EWS రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే 10 శాతం సీట్లను ప్రతి డిపార్ట్మెంట్లో ఎందుకు పెంచలేదో VC సమాధానం చెప్పాలి.. VC తనకోసం , తన చేత నిర్వహించుకున్న సీనియర్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూకు పెట్టని వీడియో రికార్డింగ్, సెంట్రల్ యూనివర్సిటీలలో ఏ ఇతర యూనివర్సిటీలలో లేని వీడియో రికార్డింగ్ పెట్టి పేద విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి తనకి కావాల్సిన వారికి సీట్లు అమ్ముకోవడం జరిగింది..మేము సవాల్ విసురుతున్నాం..గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికి తేడా తెలియని ఈ VC, కనీసం తను ఇంగ్లీష్ లో ప్రచురించుకున్న పబ్లికేషన్లను ఐన చూసుకుంటూ తప్పులు లేకుండా ఇంగ్లీషులో నిమిషం పాటు చదవగలడా… ఎంతమంది డీన్లు ఇంగ్లీషులో సమాధానం చెప్పగలరో చెప్పాలి.. ఉద్యమకారులకు, యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు మెరిట్ ఉన్నప్పటికీ, వీరికి అడ్మిషన్ వస్తే మన ఆటలు సాగవ్, మన అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తారు అనే VC తో పాటు తన కోటరీ కూడ పలుక్కుని అనగదొక్కారు. VC తన లాడ్జ్ కేంద్రంగా తన అనుచరులతో PHD ఆశావహుల దగ్గర రేట్లు ఫిక్స్ చేసి మరీ సీట్లు ఆ.. ఇక యుద్ధం మొదలైంది BC,SC,ST వ్యతిరేకి అయిన VC పైన, అతని అగ్రవర్ణ కోటరి పైన ఉద్యమాలు చేస్తామని..తరువాత జరగబోయే పరిణామాలకు వీసీ మాత్రమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు…

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img