అక్షరశక్తి, హైదరాబాద్ : తన బిడ్డ కవితను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి పాదాలకు కవిత నమస్కరించారు. బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని ఆశీర్వదించారు. ఎర్రవెల్లి నివాసానికి కవిత తన భర్త, కుమారుడితో కలిసి గురువారం మధ్యాహ్నం వెళ్లారు. ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. బిడ్డను చూడగానే కేసీఆర్ ముఖంలో ఆనందం కనిపించింది. చాలాకాలం తర్వాత ఉత్సాహంతో అధినేత కేసీఆర్ ఉన్నారు. తమ అధినేత సంతోషంలో పార్టీ నాయకులు, సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది.