తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లాల అధ్యక్షులను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఇందులో మెజార్టీగా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులే ఉన్నారు. వరంగల్ జిల్లాకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి, హన్మకొండ జిల్లాకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, మహబూబాబాద్ జిల్లాకు ఎంపీ మాలోత్ కవిత, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జిల్లాకు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జనగామ జిల్లాకు జెడ్పీ చైర్మన్ పీ సంపత్‌రెడ్డిని ప్రకటించారు.