Saturday, July 27, 2024

అప్పుడు మాత్ర‌మే నైట్ క‌ర్ఫ్యూ..

Must Read

తెలంగాణలో కరోనా వైర‌స్‌ పరిస్థితులపై హైకోర్టులో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంద‌ని, ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవన్నారు. పాజిటివిటీ 10 శాతం దాటితే కర్ఫ్యూ ఆంక్షలు అవసరముందన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ క‌రోనా పాజిటివిటీ రేటు 10 శాతం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని నివేదిక‌లో పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా ఈనెల 31 వరకు కరోనా ఆంక్షలు పొడిగించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్‌ సర్వే జరుగుతోందని ఆయన తెలిపారు. 3 రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి మెడికల్‌ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు.

అయితే.. డీహెచ్ స‌మ‌ర్పించిన నివేదిక‌ను పిటిష‌న‌ర్ న్యాయ‌వాది త‌ప్పుబ‌ట్టారు. ప్రభుత్వం తప్పుడు లెక్క‌లు సమర్పిస్తోందని పేర్కొన్నారు. కేవ‌లం 3 రోజుల్లోనే 1.70 లక్షల ఫీవర్‌ బాధితులు ఉన్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. అయితే.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదని ఏజీ ప్రసాద్ పేర్కొన్నారు. మాస్కులు, భౌతికదూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. అనంత‌రం హైకోర్టు స్పందిస్తూ.. కరోనా నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితిని వివరించేందుకు విచారణకు డీహెచ్‌ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img