Monday, September 9, 2024

ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మానుకోట పీఏసీఎస్ డైరెక్టర్, టీఆర్ఎస్ యూత్ నాయ‌కుడు నలమాస విజయ సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుక‌ల‌ను జంగిలిగొండ గ్రామంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. యువకుల‌తో క‌లిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా నలమాస సుధాకర్ మాట్లాడుతూ… పోరాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నార‌ని, దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ మాదిరి దేశం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు దేశమంతా అనుసరిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ఆయ‌న పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొయ్యల వెంకన్న, ప్రధాన కార్యదర్శి పూజల శ్రీనివాస్, వార్డ్ మెంబర్ కొమ్మరాజుల సంజీవ, గుండెల యాదగిరి, పులి సోమయ్య, యూత్ అధ్యక్షుడు శ్రీహరి, పోతుగంటి విజయ్, పులి రాజేష్, కే వినోద్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img