Monday, September 9, 2024

తెలంగాణ సుభిక్షానికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి

Must Read
  • ప‌ర్యాట‌క ప్రాంతంగా కుర‌వి..
  • మంత్రి సత్యవతి రాథోడ్‌
  • వీర‌భ‌ద్రుడి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు
    అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశంలోనే గొప్ప నాయకుడవుతారని అన్నారు. కురవి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఐదు కోట్ల రూపాయలను కేటాయించగా వీటితో 75 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది శివరాత్రి కల్లా పనులన్నీ పూర్తవుతాయని ఆమె తెలిపారు.
    ప‌ర్యాట‌క ప్రాంతంగా కుర‌వి
    కురవి ప్రాంతాన్ని త్వరలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ ప్రాంతంలో హరిత హోటల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను అధికారులకు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, కురవి జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, మ‌హ‌బూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ప‌ల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, బీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వల్లూరి కృష్ణారెడ్డి, నెహ్రునాయక్, జీవన్ నాయక్, బొడ శ్రీను నాయక్, భద్రు, బాదె నాగన్న, డాక్టర్ సుందర్ నాయక్, బొమ్మకంటి వెంకట‌ర‌మ‌ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img