Friday, July 26, 2024

కొండాది గూండాయిజ‌మే..

Must Read
  • ప్ర‌జ‌ల బాగు కోసం ముర‌ళి ఎవ‌రినైనా ఎదురించారు
  • పోలీసులు కూడా వాళ్ల ప‌నులు మాతో చేయించుకున్నారు
  • పీపుల్స్‌వార్ నేత రామ‌కృష్ణతో మాది కుటుంబ సంబంధం
  • ఆర్జీవీ, ముర‌ళి ఇద్ద‌రు కొత్త దంప‌తుల్లా మారిపోయారు
  • కొండా మూవీ ట్రైల‌ర్ రిలీజ్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కొండా ముర‌ళిది గూండాయిజ‌మే అని, ప్ర‌జ‌ల బాగు కోసం ఆయ‌న ఎంత వ‌ర‌కైనా వెళ్తార‌ని, ఎవ‌రినైనా ఎదురిస్తార‌ని మాజీ మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాంగోపాల్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న కొండా ముర‌ళి బ‌యోపిక్‌ కొండా మూవీ ట్రైల‌ర్‌ను కొండా దంప‌తుల అభిమానులు, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య హ‌న్మ‌కొండ‌లోని త‌మ నివాసంలో బుధ‌వారం అట్ట‌హాసంగా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా కొండా సురేఖ భావోద్వేగానికి లోనై ముర‌ళిని ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. త‌మ కుటుంబ నేప‌థ్యం, రాజ‌కీయ జీవితంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌బ్జాలు చేసేటోల్లు గూండాల‌ని, కానీ, క‌బ్జాదారుల‌ను ఎదురించి, పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డిన ముర‌ళీ గూండాగా మారాడాన్నారు. వాళ్లంతా దోపిడీదారులు అయితే, ముర‌ళి మాత్రం ప్ర‌జ‌లే జీవితంగా బ‌తికే నాయ‌కుడుగా ఎదిగాడ‌ని అన్నారు.

 

ప‌లువురు పోలీసులు కూడా వాళ్ల‌తో కాని ప‌నుల‌ను కొండా ముర‌ళితో చేయించుకునేవార‌ని కొంద‌రి పేర్ల‌ను కొండా సురేఖ వెల్ల‌డించారు. ముర‌ళికి కుటుంబం కన్నా ప్ర‌జ‌లే ముఖ్య‌మ‌ని తెలిపారు. పీపుల్స్‌వార్ నేత రామ‌కృష్ణ ను చాలాసార్లు క‌లిసేవార‌మ‌ని, మా కూతురు సుస్మితా ప‌టేల్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు. ఆయ‌న్ను క‌లిసిన‌ప్పుడ‌ల్లా కూతురు ఎలా ఉంది అని అడిగేవార‌న్నారు. నాడు పీపుల్స్‌వార్ పార్టీపై నిషేధం ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న చ‌నిపోతే తాను, కొండా ముర‌ళి మొగిలిచ‌ర్ల‌కు వెళ్లి ప‌రామ‌ర్శించిన విష‌యాన్ని గుర్తు చేశారు. కొండా సినిమా కోసం రామ్‌గోపాల్ వ‌ర్మ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డార‌ని, ముర‌ళి, ఆర్జీవీ ఇద్ద‌రూ కొత్త దంప‌తుల్లా మారిపోయార‌ని అన్నారు. కొండా ముర‌ళి చ‌రిత్ర దేశ‌వ్యాప్తంగా తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె అభిప్రాయప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌, కొండా ముర‌ళి, సుస్మితా ప‌టేల్‌, న‌టీన‌టులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img