- టికెట్ ఖరారు చేసిన అధిష్టానం
- సంబురాల్లో నాగరాజు అనుచరులు, పార్టీ శ్రేణులు
అక్షరశక్తి, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజవకర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు పేరు ఖరారైంది. తీవ్ర పోటీ మధ్య, అనేక సమీకరణాల నడుమ నాగరాజుకు టికెట్ దక్కింది. ఈమేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారికంగా ప్రకటన రావడంతో నాగరాజు అభిమానులు, పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వర్ధన్నపేట నియోజకవర్గంలో నాగరాజు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయ త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతో రేపటి నుంచి ఆయన మరింత దూకు డుగా ప్రచారంలో దూసుకుపోనున్నారు.
Must Read