ముందే చెప్పిన అక్షరశక్తి
అక్షరశక్తి, వరంగల్ : ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల రెండో జాబితా శుక్రవారం రాత్రి విడుదల అయింది. ఇందులో 45మంది అభ్యర్థులకు అవకాశం లభించింది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అనేక నియోజకర్గాల్లో క్లారిటీ వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక నియోజకర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో.. వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ – నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పు – కొండా సురేఖ, పరకాల – రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జనగామ – కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి – యశశ్వినిరెడ్డి, మహబూబాబాద్ – డాక్టర్ మురళీనాయక్‌లకు చోటు దక్కింది. అయితే, పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి భారతీయ పౌరసత్వం రాకపోవడంతో ఆమె కోడలు యశశ్వినికి పాలకుర్తి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో అవకాశం కల్పించింది. ఇదే విషయాన్ని అక్షరశక్తి పత్రిక ఝాన్సీరెడ్డి డౌటే.. బరిలోకి కోడలు యశశ్విని.. కథనం ప్రచురించింది. ఈ వార్త ఆ సమయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈరోజు విడుదల అయిన రెండో జాబితాలో అక్షరశక్తి పత్రిక ప్రచురించిన కథనాన్ని నిజం చేస్తూ యశశ్వినికి చోటు దక్కడం గమనార్హం.
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా హనుమాండ్ల యశశ్వినిరెడ్డి
Must Read