అక్షరశక్తి, హసన్ పర్తి : మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకరంగా మాట్లాడినందుకు హసన్ పర్తి మండల కేంద్రంలో లోని బస్టాండ్ కుడలి వద్ద ధర్నా చేసి కేటీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా హసన్ పర్తి మహిళా మండల అధ్యక్షురాలు జోరిక పూల మాట్లాడుతూ… కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరల ఇలాంటి మాటలు మాట్లాడితే చీపురు కట్టలతో తరిమి, తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, పుల్ల రవీందర్, సాయిని రామరాజు, మేకల ఆనంద్, బిగుల్లా సురేష్, మహిళామండలబత్తుల స్వాతి, పోతరాజు ప్రభాకర్, నరసింహారాములు, మీసం సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.