Tuesday, September 10, 2024

నిబంధనలు పాటించని ఆస్ప‌త్రుల‌పై కఠిన చర్యలు – వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద

Must Read

అక్ష‌రశ‌క్తి, వరంగల్: 16 ఆగస్టు 2024: నిబంధనలు పాటించని ఆసుపత్రిల పై కఠిన చర్యలు తీసుకొంటామని వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఆక్ట్, డెంగ్యూ కేసుల నివారణపై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్
మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ క్లినిక్కులు, పోలీ క్లినికులు హాస్పిటల్స్ తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు.
• జిల్లాలోని అన్ని క్లినిక్కులు, పోలీ క్లినిక్కులు, ల్యాబ్లు, ఆస్ప‌త్రులు, వెల్నెస్ సెంటర్లు, ఫీజియోథెరఫీ సెంటర్లు, నేత్ర క్లినిక్‌లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలాగే జిల్లాలోని ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, యోగ, నేచురోపతి వంటి అన్ని ఆస్ప‌త్రులు, క్లినిక్కులు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేనిచో పెనాలిటీ, సీజ్‌ చేయడం, అటువంటి క్లినిక్కులు, ఆసుపత్రలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు.
• జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రతి క్లినిక్, డయాగ్నొస్టిక్ సెంటర్, ఆసుపత్రులు మరియు అయుష్ సెంటర్లను కూడా తనికీ చేసి నిబంధనల ప్రకారం లేని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడునునని తెలిపారు.
•ఆర్ఎంపి, పీఎంపి వైద్యులు పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోకుడదని, వారు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, ఇంజెక్షన్లు, సెలైన్ లు పెట్టరాదని అల్లోపతీ వైద్యం చేయరాదని వారి దగ్గర మందుల నిల్వ ఉంచుకోరాదని తెలిపారు.
•ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో ఆయుష్ వైద్యులని డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా కానీ (లేదా) వైద్యం చేయ‌డానికి కానీ నియమించుకో కూడదని, నియమించుకున్నచో చట్ట ప్రకారం అటువంటి ఆస్ప‌త్రుల‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
• విదేశాలలో వైద్య విద్య అభ్యసించిన డాక్టర్లు తప్పనిసరిగా ఎఫ్ఎంజిఈ టెస్టులో ఉతీర్ణులై, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాతనే ప్రాక్టిస్ కానీ ఆసుపత్రులలో పని చేయటం కానీ చేసుకోవాలని తెలిపారు. చాలా మంది విదేశీ వైద్యులు ఎఫ్ఎంజిఈ పరీక్షా పాస్ కాకుండానే హాస్పిటల్స్ లో పని చేస్తున్నారని మరియు ప్రాక్టిస్ కూడా చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని మా ప్రత్యేక బృందాల తానికీలలో వైద్యులు పాస్ కాకుండా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా పని చేస్తున్నటైతే ఆ హాస్పిటల్స్ యాజమాన్యం పై, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

• ప్రతి వైద్యుడు కూడా “prescription Legible గా” మాత్రమే రాయాలని కోరారు.
• ప్రతి క్లినిక్, పోలీక్లినిక్, నర్సింగ్ హోమ్, ఆస్ప‌త్రులు, ఆయుష్ క్లినికల్, పోలీ క్లినిక్ ఆసుపత్రుల వారు వారి వారి సెంటర్లలో వసూలు చేయి ఫీజుల వివరములు తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీష్ భాషలో రిసెప్షన్ నందు బోర్డులు ఏర్పాటు చేయాలనీ, ఆ ప్రకారమే రోగుల నుండి చార్జీలు వసూలు చేయాలనీ, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరిశుభ్రత, సౌకర్యాలు అందించే విషయంలో ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వారి, వారి ఇంస్టిట్యూట్స్లో పని చేసే వైద్యులు వారి రిజిస్ట్రేషన్ నంబర్లు, వారి వారి విద్యార్హతలు కూడా రిసెప్షన్ వద్ద ప్రదర్శించాలని కోరారు.
• ప్రతి ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ నిర్ణయించుకున్న రేట్స్ (రాక్ రేట్లను) ప్రతి సంవత్సరం జూన్ నెల మొదటివారంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అందచేయాలని లేనిచో కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు.
• తెలంగాణ రాష్ట్రంలో cessarian రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా indication ఉన్న కేసులకు మాత్రమే సి-సెక్షన్ కాన్పులు చేయాలి. అనవసరంగా ఇది indication కాకుండా సి-సెక్షన్ కాన్పులు చేస్తే వైద్య అధికారులు కేసు aduit చేసి అనవసరంగా సి సెక్షన్ చేసిన హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటారు మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు రాసి సదరు వైద్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
• MTP రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే నిబండలంకు లోబడి ఇద్దరు డాక్టర్ల సమక్షలో abortion చేయాలనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు abortion చేస్తే చేస్తే ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నెల చేసిన abortion వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయంలో అందించాలని కోరారు.
• Gynecologists, ART, surrogacy level-1 & level-2 రిజిస్ట్రేషన్లు కలిగిఉన్న వారు మాత్రమే IVF సెంటర్లు నడుపుకోవడానికి అర్హులు అని level-1 & level-2 సర్టిఫికెట్స్ లేని వారు IVF సెంటర్ అని పేరు పెట్టుకోరాదని అయన తెలిపారు. ఆలా పెట్టుకున్నారని మా ప్రత్యేక తనికీ బృందాలు గుర్తించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
• వచ్చిన జబ్బుల గురుంచి పేషెంట్లకు తప్పనిసరిగా వారికీ అర్ధమయ్యే భాషలో వివరించాలని, జబ్బుకు అయ్యే ఖర్చులని కూడా ముందుగానే వివరించాలని, రోగుల హక్కులు, బాధ్యతలు ప్రతి ఆసుపత్రలో తెలిపే విదంగా బోర్డులను ఏర్పాటు చేయాలనీ కోరారు.
• Notifiable వ్యాధులు eg మలేరియా, Dengue టీబీ, HIV వంటి వ్యాధులు సోకిన వారి వివరములు ప్రతినెలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలని కోరారు.
• జిల్లాలో తనిఖీ బృందాలు నిరంతరం క్లినిక్కులు, ఆస్పత్రులు, తనిఖి చేస్తుంటాయని, తనిఖు అధికారులకు అనుమతుల ధ్రువపత్రాలు సర్టిఫికెట్లు, సిబ్బంది వివరములు, ధరల వివరాలు, చూపించవలెనని కోరారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటరమణ మాట్లాడుతూ కలెక్టర్ గారి ఇచ్చిన ఆదేశాలను నీటి నుండి అమలు చేస్తామని ఎవరైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పి సి పి ఎన్ డి టి ఆక్ట్ లకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపైన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ గారు పి పి టి ప్రెజెంటేషన్ చేసి జిల్లాలో ఉన్న డెంగ్యూ కేసుల వివరాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎంజీఎం సీకేఎం కంటి దావకాన సూపరరింటెండెంట్లు, ఐఎంఏ ట్రెజరర్, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img