- మందుపాతరతో మినీ బస్సు పేల్చివేత
- 11 మంది జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. అదును చూసి భద్రతాబలగాలపై దాడులకు దిగారు. దంతేవాడలోని అరణ్‌పూర్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఐఈడీ మందు పాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన జవాన్లను డిఫెన్స్ రీసెర్చ్ కు టీంకు చెందిన వారిగా ఆర్మీ అధికారులు గుర్తించారు. మృతుల్లో 10 మంది డీఆర్జీ జవాన్లు, డ్రైవర్ ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. అరణ్‌పూర్ లో మవోయిస్టుల ఉనికి ఉందన్న పక్కా సమాచారంతో డీఆర్జీ బృదం.. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. జవాన్లు పహారా ముంగించుకుని తిరిగి తమ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతరతో మినీ బస్సును పేల్చేశారు.
Must Read